ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుమతి ఇచ్చిన విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంబురాలు జరుపుకున్నారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
వర్గీకరణను తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామేల్, కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, తదితరులు రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంతో కలిసి డప్పు దరువులతో వర్గీకరణ సంబురాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.