Runa Mafi : తెలంగాణలో రెండోవిడత రుణమాఫీ నిధులు విడుదల

అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా. ఇప్పటికే లక్ష రుణమాఫీ చేశారు. రాష్ట్రంలోని 11 లక్షలద 34 వేల 412 మందికి రూ.6,034 కోట్ల నిధులతో రుణమాఫీ చేశారు.


Published Jul 30, 2024 03:09:13 AM
postImages/2024-07-30/1722326938_runamadi2.jpg

 

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. లక్షన్నర లోపు రుణమాఫీకి సంబంధించిన నిధులను సీఎం రిలీజ్ చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రుణమాఫీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా. ఇప్పటికే లక్ష రుణమాఫీ చేశారు. రాష్ట్రంలోని 11 లక్షలద 34 వేల 412 మందికి రూ.6,034 కోట్ల నిధులతో రుణమాఫీ చేశారు.

కాగా.. తాజాగా. 6 లక్షల 40,223 మందికి రూ.6190 కోట్లను విడుదల చేశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ పొందిన వారిలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో, చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది. మంగళవారం రోజు 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేవారు. ఇప్పటికే లక్ష లోపు రుణమాఫీలు చేశామని.. నేడు లక్షన్నర లోపు రుణమాఫీలు పూర్తి చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రంలోగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. తన విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఆగష్టు నెలలో రూ.2 లక్షల రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని రేవంత్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : kcr india-people ts-news revanth-reddy newslinetelugu ktr cm-revanth-reddy assembly harish-rao former agriculture-minister runamafi farmersloans croploan agriculture

Related Articles