Revanth reddy: కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721114553_modi20240716T124317.341.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కలెక్టర్లతో మాట్లాడారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. 
 
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం-సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu congress telanganam collectors cm-revanth-reddy congress-government press-meet

Related Articles