రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు కాలేదు అర్థం కావడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. అధికారులను అడిగినా సమాచారం ఇవ్వడం లేదని దీంతో అధికారులు, బ్యాంకర్ల చుట్టు తిరిగినా ఫలితం లేదంటూ రైతన్నలు వాట్సాప్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
న్యూస్ లైన్, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో గొప్పగా రుణమాఫీ చేశామని ఆర్భాటాలు చేస్తుంది తప్పా గ్రౌండ్ లెవల్లో చాలా మంది అన్నదాతలకు రుణమాఫీ కాలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి రుణమాఫీ జరగని రైతులు తమ వివరాలు పంపాలని ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌కు ఫిర్యాదులు భారీగా వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 24గంటల్లోనే 20 వేల మంది వాట్సాప్ ద్వారా తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు కాలేదు అర్థం కావడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. అధికారులను అడిగినా సమాచారం ఇవ్వడం లేదని దీంతో అధికారులు, బ్యాంకర్ల చుట్టు తిరిగినా ఫలితం లేదంటూ రైతన్నలు వాట్సాప్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ చేసినట్లు ప్రకటించింది. లక్షన్నర వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని తెలిపింది. అయితే గ్రౌండ్ లెవల్లో చాలా మంది రైతులు రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, బ్యాంకుల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని కన్నీళ్లు పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ 8374852619తో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. రైతులు ఎవరైనా రుణమాఫీ కాకపోతే దానికి సంబంధించిన వివరాలు తెలియాలని కోరింది. దీంతో రుణమాఫీ కాని బాధితులు భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు.