విద్యార్థుల ఆందోలన నేపథ్యంలో లిబర్టీ నుంచి అబిడ్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ బషీర్ బాగ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజాం కాలేజీకి చెందిన విద్యార్థులు సోమవారం ధర్నా నిర్వహించారు. నిజాం కాలేజీ హాస్టల్ లో గత కాలంగా సరైన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కోసం అధికారులు హాస్టల్ గదులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అయితే, విద్యార్థుల ఆందోలన నేపథ్యంలో లిబర్టీ నుంచి అబిడ్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో.. పోలీసులు వారిని వ్యాన్‌లో ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.