గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీని 1:100కు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆందోలనలు చేస్తున్నారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలిని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసనలు తెలుపుతున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీని 1:100కు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆందోలనలు చేస్తున్నారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలిని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్(Motilal Nayak) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, గ్రూప్స్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ(OU Students)లో సోమవారం విద్యార్థులు ధర్నా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోతీలాల్ విద్యార్థి నాయకుడికి మద్దతుగా గద్వాల్ జోగులాంబ(Gadwal jogulamba) జిల్లాలో డీఎస్సీ, గ్రూప్ -2,3 నిరుద్యోగ అభ్యర్థులు నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లా కేంద్రంలో కూడా డీఎస్సీ అభ్యర్థులు మోతిలాల్‌కు మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.