Paris Olympics: మనుబాకర్‌‌కు ముర్ము అభినందనలు

ఒలింపిక్స్‌లో విజయం సాధించిన నేపథ్యంలో మనుబాకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మనుబాకర్‌ విజయంపై స్పందించారు.


Published Jul 28, 2024 06:32:35 AM
postImages/2024-07-28/1722166345_modi20240728T164838.675.jpg

న్యూస్ లైన్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో మనుబాకర్‌ పథకం అందుకుంది. ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె పతకం అందుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్‌కు కాంస్య పతకం దక్కింది. ఇదే విభాగంలో ఇద్దరు కొరియన్లకు స్వర్ణం, రజత పతకం సాధించారు. ఓయె జిన్ 243.2 పాయింట్లు, కిమ్ 241.3 పాయింట్లు సాధించారు.  

ఒలింపిక్స్‌లో విజయం సాధించిన నేపథ్యంలో మనుబాకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మనుబాకర్‌ విజయంపై స్పందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకంతో భారతదేశ పతకాన్ని తెరిచినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ముర్ము పోస్ట్ పెట్టారు.

షూటింగ్ పోటీల్లో ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మనుబాకర్‌ అని ఆమె వెల్లడించారు. మను భాకర్ సాధించిన విజయం పట్ల భారతదేశం గర్విస్తోందని తెలిపారు. ఆమె ఫీట్ చాలా మంది క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu centralgovernment telanganam paris-olympic manubhaker paris2024 olympic2024- bronzemedal pistolevent

Related Articles