పార్టీలోకి చేర్చుకునేందుకు పోచారంపై కాంగ్రెస్ చూపిన మమకారం అతితక్కువ సమయంలోనే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయనకు రేవంత్ సర్కార్ తగిన శాస్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు పోచారంకు కాంగ్రెస్ పార్టీలో కూసంత గౌరవం కూడా తక్కడం లేదని చర్చ నడుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి BRSలో ఉండగా ఆయనకు దక్కిన గౌరవం అంతా ఇంతా కాదు. గతంలో BRS అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా.. పోచారంకు తెలంగాణ శాసన సభాపతిగా పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాన్సువాడ నియోజకవర్గానికి సరిపోయే అన్ని నిధులు కూడా కేటాయించారు.
ఓ వైపు అసెంబ్లీ, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓటమిని చవిచూసింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారి బాటలోనే నడిచిన పోచారం కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానం చేశారు. కేసీఆర్, BRS, బాన్సువాడ నియోజకవకర్గ ప్రజలను పోచారం మోసం చేసారని విమర్శలు కూడా భారీగా వెల్లువెత్తాయి.
అయితే, పార్టీలోకి చేర్చుకునేందుకు పోచారంపై కాంగ్రెస్ చూపిన మమకారం అతితక్కువ సమయంలోనే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయనకు రేవంత్ సర్కార్ తగిన శాస్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు పోచారంకు కాంగ్రెస్ పార్టీలో కూసంత గౌరవం కూడా తక్కడం లేదని చర్చ నడుస్తోంది.
ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శాసనసభ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. అయితే, సభలో పోచారంను ఓ మూలన కూర్చోబెట్టారు. అసెంబ్లీ హాల్‌లో ముందు వరుసలో స్థలం ఖాళీగానే ఉంది. అయినప్పటికీ ఎక్కడో మూలాన పడినట్లుగా.. పోచారంను వెనుక వరుసలో ఉంచారు.
దీంతో పోచారంకు రేవంత్ ఇచ్చిన గౌరవం.. మరెవరికీ దక్కదేమో అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్‌కు అన్యాయం చేసి అధిక పార్టీ అంటూ ఉరుకులు పెడితే ఇలాగే జరుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. పోచారంను కాంగ్రెస్ సర్కార్ మూలన కూర్చోబెట్టిందంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
పోచారనికి కాంగ్రెస్లో ఇచ్చిన గౌరవం.. pic.twitter.com/1fou96kkKY — News Line Telugu (@NewsLineTelugu) July 23, 2024