కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ శంకర్‌పై దాడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు, వారి అనుచరులు ప్రయత్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ శంకర్‌పై దాడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు, వారి అనుచరులు ప్రయత్నించారు. ఆయన వాహనాన్ని వెంబడిస్తూ అసభ్యకర రీతిలో సంజ్ఞలు చూపుతూ.. అడ్డుకుని దాడికి యత్నించారు. అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్ట్ శంకర్.. ప్రస్తుతం స్థానిక వెల్దండి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.
భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి తమ్ముళ్ల అనుచరులు. రోడ్డుపై గూండాల మాదిరిగా వెంబడించి జర్నలిస్ట్ శంకర్ కారును చుట్టుముట్టి దాడికి యత్నం.#congressatacksjournalists pic.twitter.com/PH0GwFpL0J — News Line Telugu (@NewsLineTelugu) August 22, 2024
ప్రజాపాలనలో జర్నలిస్టులపై దాడులు చేస్తారా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని జర్నలిస్టు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.