ఏడు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలను ఎత్తేసి.. ఉపాధ్యాయులను బదిలీ చేసింది. దీంతో.. పిట్టలవాడ గ్రామంలోని పిల్లలు
న్యూస్ లైన్ డెస్క్ : మొన్నటి వరకు ఆ ఊర్లో స్కూల్ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూల్ ని ఎత్తేశారు. కానీ.. పిల్లలు చదువుకోవాలి కదా.. అందుకే అవస్థలు పడుతూ 4 కి.మీ నడుచుకుంటూ వెళ్తున్నారు.
సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని మధిర గ్రామంలో పిట్టలవాడలో 70 కుటుంబాలు జీవనం ఉంటున్నాయి. గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు ఉన్నా టీచర్ ఉండేవారు కదా. మాజీ మంత్రి హరీశ్ రావు చొరవతో సమీప గ్రామంలోని టీచర్లను డిప్యూటేషన్ మీద పిట్టలవాడ ప్రాథమిక పాఠశాలకు పంపించారు. దీంతో.. ఆ గ్రామంలోని విద్యార్థులకు మంచి సౌకర్యం లభించింది.
అయితే.. ఏడు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలను ఎత్తేసి.. ఉపాధ్యాయులను బదిలీ చేసింది. దీంతో.. పిట్టలవాడ గ్రామంలోని పిల్లలు చదువుకునేందుకు పక్క గ్రామానికి వెళ్లక తప్పట్లేదు. ప్రతిరోజూ 4 కి.మీ నడుచుకుంటూ వెళ్లి చదువుకుంటున్నారు. రోజూ అంతదూరం నడుచుకుంటూ వెళ్లలేమని.. తమ గ్రామంలో ఉనన పాఠశాలకే ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.