ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సంబంధించిన రుణమాఫీ లోన్ డబ్బులు పడిన విషయం చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు తమకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. అర్హులందరికీ రుణమాఫీ చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదని రాష్ట్రంలోని పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర కూడా నిర్వహిస్తున్నారు.
ఓవైపు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోలన చేస్తున్నారు. కనీసం సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలకు మాత్రం రుణమాఫీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సంబంధించిన రుణమాఫీ లోన్ డబ్బులు పడిన విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా, కాంగ్రెస్ నేతలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, గండ్ర సత్యనారాయణ, రాందాస్ మాలోత్, కోరం కనకయ్యలకు రుణమాఫీ అయినట్లు పలు డాక్యూమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రుణమాఫీ అనేది రైతుల కోసమా లేక కాంగ్రెస్ ఎమ్యెల్యేల కోసమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.