రాష్ట్రంలోనే కాదు, సొంత నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నియోజవర్గాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే ప్రతిపక్షాల ప్రచారం కారణమై ఉండొచ్చు. కానీ, సొంత పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ నేతల పట్ల తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్ల నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పలేనంత వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలోనే కాదు, సొంత నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నియోజవర్గాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే ప్రతిపక్షాల ప్రచారం కారణమై ఉండొచ్చు. కానీ, సొంత పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ నేతల పట్ల తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(Mandula Samel)కు సోమవారం తల దించుకునే పరిస్థితి వచ్చి పడింది. అర్వపల్లి వద్ద సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు నిరనస సెగ ఎదురైంది. ఆందోళన చేస్తూ సామెల్ కారును అడ్దకునే ప్రయత్నం చేశారు.
తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే సామెల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.