ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాబోయే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక కామెంట్లు చేశారు.
న్యూస్‌లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాబోయే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక కామెంట్లు చేశారు. ఐదు నెలల పాటు తిహార్ జైలులో ఉండి.. ఈరోజు బెయిల్ పొందిన కవితపై ఆయన ఆరోపణలు చేశారు. ఇరువైపులా వాదనలు విని కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ రాజకీయ ఆరోపణలు చేశారు.
కవితకు బెయిల్ రావడం ఊహించిందేనని.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావులు బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ సంపాదించారని ఆయన కామెంట్లు చేశారు. కాగా.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.. మహేశ్ గౌడ్ కి ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు అస్సలు జ్ణానం లేనట్టుంది. సుప్రీంకోర్టు ఏ పార్టీకి చెందినది కాదని.. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అని.. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడితే చర్యలు తప్పవంటూ కామెంట్లు చేస్తున్నారు.