Congress: కట్టేది రూ.1768 కోట్లు.. ప్రచారం రూ.7 వేల కోట్లు

మరోసారి మిత్తీ గురించి మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌కు ప్ర‌తినెలా మొద‌టి తారీఖున తాను, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క క‌లిసి రూ.7వేల కోట్ల వ‌డ్డీ క‌డుతున్నామ‌ని వాపోయారు. కానీ అస‌లు లెక్క‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతోంది. నెల‌కు రూ.7వేల కోట్లు క‌డితే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రూ.49,000 కోట్లు క‌ట్టాల్సి ఉంటుంది. కానీ రేవంత్ స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌ట్టిన మొత్తం వ‌డ్డీ కాగ్ నివేదిక‌ల ప్రకారం రూ. 12,380 కోట్లు మాత్ర‌మే. ఈ ఏడాది అక్టోబ‌ర్ 2న ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టగా.. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్రవేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో 5 నెల‌ల‌కు రూ.14, 588 కోట్ల వ‌డ్డీ క‌ట్టిన‌ట్టు పేర్కొన్నారు.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721363338_CMRevanthReddy5.jpg

న్యూస్ లైన్ డెస్క్: అబద్దం చెబితే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయేలా అబద్దాన్ని నిజంలా ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం కట్టే వడ్డీపై ఆయన చెప్పే లెక్కలకు, కాగ్ లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గత ప్రభుత్వంపై దుష్ప్రచారమే ఎజెండాగా ఆయన ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ నెలా ఏడు వేల కోట్లు అంటూ ఆయన చెబుతున్న లెక్క.. కాగ్ రిపోర్టులో ఉన్నదానికి ఎక్కడా మ్యాచ్ అవ్వడం లేదన్న విషయం తెలుస్తోంది. సీఎం రేవంత్ అబద్దాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని రేవంత్ స‌ర్కార్ ప‌దే ప‌దే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. గురువారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మిత్తీ గురించి మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌కు ప్ర‌తినెలా మొద‌టి తారీఖున తాను, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క క‌లిసి రూ.7వేల కోట్ల వ‌డ్డీ క‌డుతున్నామ‌ని వాపోయారు. కానీ అస‌లు లెక్క‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతోంది. నెల‌కు రూ.7వేల కోట్లు క‌డితే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రూ.49,000 కోట్లు క‌ట్టాల్సి ఉంటుంది. కానీ రేవంత్ స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌ట్టిన మొత్తం వ‌డ్డీ కాగ్ నివేదిక‌ల ప్రకారం రూ. 12,380 కోట్లు మాత్ర‌మే. ఈ ఏడాది అక్టోబ‌ర్ 2న ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టగా.. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్రవేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో 5 నెల‌ల‌కు రూ.14, 588 కోట్ల వ‌డ్డీ క‌ట్టిన‌ట్టు పేర్కొన్నారు.  

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో 2 నెల‌లకు రూ. 6625 కోట్ల వ‌డ్డీ కట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ‌పెట్టిన‌ బడ్జెట్ ప్రకారం 12 నెలలకు వ‌డ్డీల‌కు అయ్యే ఖర్చు రూ.22407 కోట్లు ఉంది. ఈ లెక్క‌న చూసిన‌ట్ట‌యితే ప్ర‌భుత్వం నెల‌కు రూ.1768 కోట్ల వ‌డ్డీ క‌డుతుండ‌గా వచ్చే 6 నెలల్లో రూ. 4600 కోట్ల అస‌లు మాత్రమే క‌ట్టాల్సి ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నెల‌కు రూ.7వేల కోట్ల వ‌డ్డీ ఎవ‌రికి క‌డుతున్నారు...? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి అబ‌ద్దాల‌తోనే కాంగ్రెస్ నేత‌లు కాలం గ‌డుపుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఏడు నెలల్లోనే ప్ర‌భుత్వం రూ. 35,188 కోట్ల అప్పులు చేసింది. తాజాగా ఈ నెల 16న రూ.2000 కోట్ల అప్పు తీసుకువ‌చ్చింది. దీంతో గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్న రేవంత్ స‌ర్కార్ ఎందుకు ప్ర‌తినెలా అప్ప‌లు చేస్తుందనే చ‌ర్చ మొద‌లైంది. తెచ్చిన అప్పులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏ సంక్షేమ కార్యక్రమానికి ఆ డబ్బులను వినియోగిస్తున్నారు? లేదా ఏ కాంట్రాక్టర్‌ జేబులు నింపుతున్నారు అని పలువురు నిలదీస్తున్నారు. కాకి లెక్కలు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించడంలో ఆరితేరిపోయారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఒక అబద్దాన్ని తరుచూ చెబితే దానికి ఎలాంటి ప్రామాణికత ఉండదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని పలువురు హితవు పలుకుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : ts-news newslinetelugu congress telanganam congress-government raitubandhu runamafi

Related Articles