రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అసలు రూపం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పాపం పండనుందని, కాంగ్రెస్‌కు ప్రజలంతా స్వస్తి చెబుతారని జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు మేలు చేస్తామని ప్రమాణం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టేశారని విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ధర్నా చౌక్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొని నిరుద్యోగులకు తన మద్దతు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు అబద్దపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అందులో కూడా మోసం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అసలు రూపం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పాపం పండనుందని, కాంగ్రెస్‌కు ప్రజలంతా స్వస్తి చెబుతారని జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు మేలు చేస్తామని ప్రమాణం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టేశారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు ఎవరికి దోచినంత వారు దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నెరవేరుస్తామన్న హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే ఎందుకు పూర్తి చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.