Telangana: హైడ్రా కూల్చివేతలపై సీఎస్ సీరియస్

అధికారులు ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించాలని ఇళ్ల యజమానులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
 


Published Aug 29, 2024 03:52:01 PM
postImages/2024-08-29/1724926921_shantikumari.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి సీరియస్ అయ్యారు. దుర్గం చెరువు FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గురువారం ఉదయం హైడ్రా అధికారులు ఇళ్ల యజమానులకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అధికారుల నోటీసులపై ఇళ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించాలని ఇళ్ల యజమానులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులతో శాంతికుమారి సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హైడ్రా, GHMC, HMDA, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె భేటీ అయ్యారు. ORR పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని శాంతికుమారి తెలిపారు. 

ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, GHMC, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని ఆమె తెలిపారు. దీని వల్ల గందరగోళ వాతావరణం నెలకొంటోందని వెల్లడించారు. అందుకే ORR పరిధిలోని అక్రమ కట్టడాల తోల్లగింపు కోసం హైడ్రా ద్వారానే నోటీసులు పంపించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు.

గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకే హైడ్రా పని చేయాలని అధికారులకు ఆమె సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu tspolitics hydra-commissioner-ranganath

Related Articles