power cuts: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరెంట్ కష్టాలు

Published 2024-07-04 17:35:20

postImages/2024-07-04/1720094720_modi27.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థ పాలన వల్లే కరెంట్ కోతలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. 

మరోవైపు 24 గంటలు అంతరాయం లేని కరెంట్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో అంతరాయం తలెత్తినా.. వెంటనే కరెంట్ సిబ్బంది అక్కడ కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభల్లోనే పలు మార్లు కరెంట్ పోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. 

తాజగా, ఇలాంటి చేదు అనుభవమే మరో ఎమ్మెల్యేకి ఎదురైంది. మీటింగ్ కోసం వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని కరెంట్ పోయిందనే కారణంతో వెయిట్ చేయించారు. మహాబుబాద్ జిల్లా తోర్రుర్ మున్సిపాలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి తోర్రుర్ మున్సిపాలిటీలో సర్వ సభ్య సమావేశానికి హాజరయ్యారు. అయితే, మీటింగ్ మొదలు కాకముందే కరెంట్ లేకపోవడంతో కింద ఉన్న హాల్‌లోనే యశశ్వినిని కూర్చోబెట్టారు. ఇక ఇదంతా చుసిన కార్యకర్తలు.. ఎమ్మెల్యేలకు కూడా కరెంట్ కోతలతో తిప్పలు తప్పడం లేదని అంటున్నారు.