యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బషీరాబాద్ స్టేషన్‌కు పిలిచి కొడుకు అడ్రస్ చెప్పాలని కాళ్లు, చేతులు వాచిపోయేలా పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టారని నరేష్ తల్లి కళావతి వాపోయింది. కొడుకు ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో దళితులపై జరుగుతున్న ఆగడాలు ఆందోలన కలిగిస్తున్నాయి. ఇటీవల షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరువకముందే మరో ఉదంతం జరిగింది. ఓ దళిత మహిళపై పోలీసులు గత 3 నెలలుగా లాఠీ ఛార్జ్ చేస్తున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లోనుండి వెళ్ళిపోయారు. అయితే, యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బషీరాబాద్ స్టేషన్‌కు పిలిచి కొడుకు అడ్రస్ చెప్పాలని కాళ్లు, చేతులు వాచిపోయేలా పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టారని నరేష్ తల్లి కళావతి వాపోయింది. కొడుకు ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో దళిత సంఘాలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విచారణ పేరుతో దళిత మహిళపై విచక్షణా రహితంగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దళిత మహిళకు న్యాయం చేయాలని, అప్పటివరకు నిరసన ఆపేది లేదని స్పష్టం చేశారు.