కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉండేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. త్వరలోనే వివరాలతో సహా వాటిని బయటపెడ్తామని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీలో చివరికి నలుగురే మిగులుతారని అన్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉండేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. త్వరలోనే వివరాలతో సహా వాటిని బయటపెడ్తామని తెలిపారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారని విమర్శించారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా.. రాజకీయం చేస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.