Delhi Pollution: ఇలా అయితే ఢిల్లీ ని ఎవ్వరు కాపాడలేరు..!

ఈ ఉదయం ఆరు గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటేసింది.


Published Nov 01, 2024 04:07:26 PM
postImages/2024-11-01/1730457446_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా అన్ని రికార్డుల్లోకి ఎక్కేసింది. ఢిల్లీ జనాలకు ఎంత చెప్పినా వినడం లేదు. దీపావళి సంధర్భంగా గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా దీపావళి సంధర్భంగా ఢిల్లీ వాసులకు మతాబులకు పర్మిషన్ లేదు. అయినా జనాలు పట్టించుకోలేదు. దీంతో ఈ ఉదయం ఆరు గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటేసింది.


ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఈస్ట్, వెస్ట్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాల్చి పండుగ జరుపుకొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఈ ఉదయం ఆరు గంటల సమయానికి బురారి క్రాసింగ్‌లో 394, జహంగీర్‌పురిలో 387, ఆర్కే పురంలో 395, రోహిణి (385), అశోక్ విహార్‌లో 384, ద్వారకా సెక్టార్ 8లో 375, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో 375,  మందిర్‌ మార్గ్‌లో 369, పంజాబీ బాఘ్‌లో 391, ఆనంద్ విహార్‌లో 395, సిరి ఫోర్ట్‌లో 373, సోనియా విహార్‌లో 392గా గాలి నాణ్యత నమోదైంది. ఎయిర్ క్వాలిటీలో ఇది అంత్యంత నాసిరకం. రాత్రి ఒంటి గంట తర్వాత గాలిలో నాణ్యత క్రమంగా తగ్గిపోయింది.  ఇలానే జరిగితే ఢిల్లీని ఎవ్వరు కాపాడలేరంటూ నేషనల్ మీడియా ఏకి పారేస్తుంది.


ఢిల్లీ వాసులు నిషేధాన్ని పక్కనపెట్టి బాణసంచా కాల్చడంతో అనేక ప్రాంతాల్లో 2.5గా ఉన్న స్థాయులు పెరిగాయి. ఇది ఆమోదయోగ్యమైన దాని కంటే 15 రెట్లు ఎక్కువ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pollution delhi diwali

Related Articles