Chandini Chowdary: తీవ్రంగా గాయపడ్డ హీరోయిన్..!

ఓ ఏడాది నుంచి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు. దీంతో అంతా ఏమైందా అని ఆరా తీస్తంటే తనే ఓ పోస్ట్ చేసింది.


Published Nov 05, 2024 04:11:00 PM
postImages/2024-11-05/1730803336_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్;  టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఫస్ట్ సినిమా గుర్తుందిగా అదే కలర్ ఫొటో ఆ హీరోయిన్ చాందినీ కి తీవ్రగాయాలయ్యాట. ఈ ముద్దగుమ్మ ఓ ఏడాది నుంచి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు. దీంతో అంతా ఏమైందా అని ఆరా తీస్తంటే తనే ఓ పోస్ట్ చేసింది.


వెబ్ సిరీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారింది. హీరోయిన్ గా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కలర్ ఫోటో సినిమా ద్వారా నటిగా ప్రశంసలు అందుకుంది చాందిని. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత మ్యూజికల్ షాప్ మూర్తి, ఏవమ్ చిత్రాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే తనకు కొన్ని రోజుల క్రితం గాయమైందని అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేనని చెప్పింది.


గాయం అయినాక కూడా ... నేను దాని తీవ్రతను అర్థం చేసుకోలేక షూటింగ్స్ లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం మరింత పెద్దదిగా మారింది. ఎంత పనిచేస్తే అంత పెయిన్ ఉందని అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాకు తిరిగి వస్తాను” అంటూ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఓ ప్రాజెక్టులో చాందిని కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె లుక్ విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles