విషయం తెలిసిన వారికంటే జనాలు వికీపీడియాను...గూగుల్ నే ఎక్కు న్ముుతున్నారు. అలాంటి వికిపీడియాకు కేంద్రం నోటీసులు పంపింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు మనకేం డౌట్ వచ్చినా గూగుల్ తల్లిని అడగడం ఇప్పుడు మనకి చాలా సాధారణమైన విషయం. అసలు విషయం తెలిసిన వారికంటే జనాలు వికీపీడియాను...గూగుల్ నే ఎక్కు న్ముుతున్నారు. అలాంటి వికిపీడియాకు కేంద్రం నోటీసులు పంపింది. వీకిపీడియాలో ఎక్కువ శాతం పక్షపాత ధోరణి కనిపిస్తుందని...చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని... కానీ వికీపీడియాకు ఆ వ్యవస్థ ఎందుకు లేదని కేంద్రం ప్రశ్నించింది. వికీపీడియాను మధ్యవర్తిగా కాకుండా... పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కొంతమంది వ్యక్తులతో కూడిన బృందానికి మాత్రమే ఈ పేజీల్లోని సమాచారంపై నియంత్రణ ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొంది. చాలా వరకు జనాలు వీకిపీడియా నిజమనే భ్రమలో ఉన్నారని ఇది సైబర్ న్యాయం అని తెలిపారు.
కేంద్రం మాత్రం ప్రచురణకర్తగా ఎందుకు చూడవద్దని ప్రశ్నించింది. ఈ నోటీసులకు వికిపీడియా స్పందించిన తర్వాత కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పై విక్కీపిడియా సమాచారం కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని తెలిపింది.