ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైనదిగా నమోదైంది. ప్రస్తుతం ఏక్యూఐ 400 అంతకంటే ఎక్కువగానే ఉంది. దీపావళికి ముందు 370 ఉండేది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం చాలా దారుణంగా ఉంది. ప్రపంచంలో అత్యంత విషపూరిత గాలులు కలిగిన నగరంగా తెలుపుతుంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. గాలి నాణ్యత సూచిక (AQI) 382కి చేరుకోవడంతో ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైనదిగా నమోదైంది. ప్రస్తుతం ఏక్యూఐ 400 అంతకంటే ఎక్కువగానే ఉంది. దీపావళికి ముందు 370 ఉండేది.
ఢిల్లీ కాలుష్యంలో కేవలం 15 శాతం మాత్రమే వ్యవసాయ వ్యర్థాలు ఉండగా, శుక్రవారం నాటికి 35 శాతం కన్నా ఎక్కువగా తగ్గింది. ఫ్యాక్టరీలు..వెహికల్స్ లాంటివి పరిస్థితులను మరింత దారుణంగా మారింది. ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, ద్వారకా, జహంగీర్‌పురి, ముండ్కా, నజఫ్‌గఢ్, లజ్‌పత్ నగర్, పట్‌పర్‌గంజ్, వివేక్ విహార్, రోహిణి, పంజాబీ బాగ్, వజీర్‌పూర్‌లోని రెండు స్టేషన్‌లు ఏక్యూఐ స్థాయిలకు చేరుకున్నాయి.
ఇవన్నీ అత్యంత పొల్యూషన్ కలిగిన ఏరియాలు.స్థానిక కాలుష్య వనరులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ ఉద్గారాల కలయిక ఈ వార్షిక సంక్షోభానికి దారితీస్తుంది. అదనంగా, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఇలానే కంటిన్యూ అయితే ఢిల్లీ గాలి పీలిస్తే శ్వాస కోశ ఇబ్బందులు...దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశముందని అంటున్నారు నిపుణులు.