గత సంవత్సరం ఫిబ్రవరిలో పాత కేటీపీఎస్ ప్లాంట్‌లోని 100,120 మీటర్ల ఎత్తైన టవర్లను గతంలో కూల్చివేశారు.
న్యూస్ లైన్ డెస్క్: దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం సోమవారం జరిగింది. పాల్వంచలోని కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను కూల్చివేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ ఈ టవర్ల కూల్చివేత పనులను చేపట్టింది. నిపుణుల పర్యవేక్షణలోనే ప్రోటోకాల్ ఫాలో అవుతూ.. కూల్చివేత పనులను చేపట్టారు.
కూల్చివేసిన టవర్లలో నాలుగు 1966,1967 మధ్య నిర్మించగా.. మిగిలిన నాలుగిటిని 1974,1978 మధ్య నిర్మించారు. కరెంట్ ఉత్పత్తికి తోడ్పడేలా జపాన్ టెక్నాలాజీని ఉపయోగించి వీటిని తయారు చేశారు. అయితే, వీటిని ఎప్పుడో కూల్చేయాలనే అనుకున్నప్పటికీ.. ఎన్నికల కోడ్ రావడంతో కూల్చివేత పనులు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. కాగా, గత సంవత్సరం ఫిబ్రవరిలో పాత కేటీపీఎస్ ప్లాంట్‌లోని 100,120 మీటర్ల ఎత్తైన టవర్లను గతంలో కూల్చివేశారు.