అయినప్పటికీ వినిపించుకోని స్థానికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటల్ షా బాబా దర్గా దగ్గర విద్యత్, విజిలెన్స్ అధికారులను అడ్డుకొని నిర్బంధించారు. కరెంట్ చార్జీలు వసూల్ చేసే బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అధికారులు తెచ్చిన రిపోర్టులను చించేశారు. సాకులు చెప్తూ, తనిఖీల పేరుతో వస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: అధికారులను స్థానికులు నిర్బంధించారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలో తనిఖీలు చేయడానికి వెళ్లిన కరెంట్, విజిలెన్స్ అధికారులను స్థానికులు నిర్బంధించారు. కరెంట్ బిల్లులు కట్టకుండా ఉండడంతో పాటు.. మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందని సమాచారం రావడంతో తనిఖీలకు వచ్చామని అధికారులు తెలిపారు.