కుక్క కలలో కనిపించిందా..జరిగేది ఇదే.! 2024-06-26 21:53:45

న్యూస్ లైన్ డెస్క్: మనం రాత్రులు పడుకున్న సమయంలో  రకరకాల కలలు వస్తూ ఉంటాయి. ఈ కళలు వాస్తవ జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు అంటూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం  జంతువులు, పక్షులు, కలలో కనిపిస్తే  రకరకాల ఫలితాలు ఉంటాయని అంటున్నారు.  రాత్రి పడుకున్న సమయంలో కుక్కలు కలలో కనిపిస్తే  దీనికే సాంకేతమని అంటున్నారు.

అయితే కలలో కనిపించిన కుక్క మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం  మీరు మీ దగ్గర బంధువులతో గొడవలు పడతారని సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సాంకేతం.  ముఖ్యంగా మీకు దగ్గర ఉన్న వారికి అన్యాయం చేయాలని చూస్తారని అంటారు. అలాగే తెలుపు రంగు కుక్క మీ కలలో కనిపిస్తే  మీకు జీవితంలో సంతోషం వస్తుందని, త్వరలోనే జీవితంలో ఎదుగుతారని సాంకేతం.

నల్ల కుక్కలు కలలో కనిపిస్తే జీవితంలో నష్టాలు రాబోతున్నాయని, మీకు దగ్గర సన్నిహితులే నమ్మకద్రోహం చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కుక్క రంగును బట్టి,  కనిపించే పొజిషన్ ను బట్టి మనకు లాభనష్టాలు ఉంటాయని తెలియజేస్తున్నారు.