తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలు అంటే తెలియని వారు ఉండరు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరందరికీ మూల స్తంభం
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలు అంటే తెలియని వారు ఉండరు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరందరికీ మూల స్తంభం చిరంజీవి అని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవి అసలు పేరు చిరంజీవి కాదట. చిరంజీవి అనే పేరు పెట్టుకోవడం వెనుక ఒక పెద్ద కథ ఉందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. చాలామందికి చిరంజీవి అంటేనే గుర్తుపడతారు. అలాంటి ఈయనకు చిరంజీవి అనే పేరు రావడం వెనుక ఒక పెద్ద కథ ఉంది.
అయితే ఈ పేరు గురించి చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఓ రోజు గాఢ నిద్రలో ఉన్నారట. నిద్రలోనే ఆయనకు ఒక కల వచ్చిందట. ఆ కలలో చిరంజీవి రాములవారి గర్భగుడిలో సోమసిల్లి పడిపోయారట. ఆ టైంలో ఒక పదేళ్ల పాప గుడిలోకి వచ్చి ఏంటి చిరంజీవి ఇక్కడ పడుకున్నావు బయటికి వెళ్లి పని చూసుకో అన్నదట. చివరికి ఆయన నేనేంటి గుడిలో ఉన్నాను అని అనుకుంటున్నారట. అసలు నా పేరు శివ శంకర్ కదా ఈ పాప చిరంజీవి అని పిలుస్తుంది ఏంటి. నేను ఉలిక్కిపడి లేవడం ఏంటి అనుకుంటూ వస్తుండగా, గుడి బయట నుంచి నా స్నేహితుడు కూడా చిరంజీవి రారా వెళ్దాం అని పిలిచారట. ఇలా అందరూ నన్ను చిరంజీవి అని పిలుస్తున్నారు ఏంటి అని అనుకునే సమయంలో ఆయనకి మెలకువ వచ్చిందట.
ఈ విషయాన్ని మొత్తం తన తల్లి అంజనకు చెప్పారట. దీంతో అంజనా కూడా చిరంజీవి నేమ్ చాలా బాగుందిరా ఇదే నీ స్క్రీన్ నేమ్ గా పెట్టుకొని చెప్పిందట. నీకు అప్పటినుంచి ఆయన స్క్రీన్ నేమ్ గా చిరంజీవి అని చెప్పుకుంటూ వచ్చారు. అదే ఆయన బ్రాండ్ నేమ్ అయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్టా డైరెక్షన్ లో "విశ్వంబరా" చిత్రంలో చేస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వస్తున్నటువంటి ఈ చిత్రంలో త్రిష కథానాయకగా చేస్తోంది.ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు.