Rakhi 2024: రాఖీ ..తీసేయడానికి కూడా నియమాలుంటాయని తెలుసా ?

కొంతమంది  ఆరోజు సాయంత్రమే తీసేస్తారు. కాని చాలా మంది రెండు మూడు రోజులు ఉంచుకుంటారు. కాని ఈ తప్పు చేయకూడదు.


Published Aug 17, 2024 02:59:00 PM
postImages/2024-08-17/1723887135_770834rakhi.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాఖీ పండుగ రోజు అక్క , చెల్లెలు రాఖీ లు కడతారు. కట్టడం ఓకే కాని ..తియ్యడానికి నియమాలుంటాయని తెలీదు. కాని ఎలా పడితే అలా తియ్యకూడదు. కొంతమంది  ఆరోజు సాయంత్రమే తీసేస్తారు. కాని చాలా మంది రెండు మూడు రోజులు ఉంచుకుంటారు. కాని ఈ తప్పు చేయకూడదు. ఇలా చేయడం అశుభం కూడా రాఖీ కట్టడం కూడా మంచి ముహూర్తం చూసి కట్టుకోవాలి. 


ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగ. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముల్ల ప్రేమకు ప్రతీక.  సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. కట్టిన రాఖీ ని ముడి జాగ్రత్తగా విప్పాలి. తెంపడం కాని కట్ చేయడం కాని చెయ్యకూడదు. అశుభం. రక్షాబంధన్ తర్వాత ఎన్ని రోజుల వరకూ రాఖీని ఉంచుకోవాలి.ఈ పండుగ ఆగష్టు 19 సోమవారం జరుపుకుంటారు. ఈ సారి సోమవారం వచ్చింది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం 1:30 తర్వాత జరుపుకోవాలని జ్యోతిష్యులు చెప్తున్నారు.


* మధ్యాహ్నం 1:46 నుండి 4:19 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం.


* సాయంత్రం శుభ సమయం: సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07 వరకు.


రాఖీ కట్టాలంటే ముందు సోదరుడుకి బొట్టు పెట్టి..స్వీట్ పెట్టి ..రాఖీ కట్టాలి. మీ కంటే చిన్నవాడు అయితే చక్కగా ఆశీర్వాదించండి. అన్నయ్య అయితే ఆయన కాళ్లకు దండం పెట్టండి. ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయండి. రాఖీ విరిగిపోయినా లేదా చినిగిపోయినా దానిని ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు మూలాల దగ్గర పాతిపెట్టండి లేదా పారుతున్న నీటిలో వదిలెయ్యండి. ఇలా చేస్తే మీ సోదరికి మంచిది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu rakhi

Related Articles