మన ఇండియన్ వంటకాల్లో అత్యంత రుచికరమైన వంటకం సమోసా. ఈ సమోసాలు ఇష్టపడని వారు ఉండరు. ఈవినింగ్ సమయంలో ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక సమోసా ఒక చాయ్ తప్పనిసరిగా
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియన్ వంటకాల్లో అత్యంత రుచికరమైన వంటకం సమోసా. ఈ సమోసాలు ఇష్టపడని వారు ఉండరు. ఈవినింగ్ సమయంలో ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక సమోసా ఒక చాయ్ తప్పనిసరిగా ఆరగించాల్సిందే. ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఇది కూడా భాగమైపోయింది. అలాంటి సమోసాలు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టపడి తింటారు.. అయితే సమోసాలు మన ఇండియాలో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన సైజుల్లో ఒక్కోరకంగా తయారు చేస్తూ ఉంటారు. రుచిలో కూడా కాస్త మార్పు ఉంటుంది.
ఏది ఏమైనా కానీ, ఎక్కడికి వెళ్లినా దాని పేరు మాత్రం మారలేదు. దేశం మొత్తంలో దీని పేరు సమోసానే. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సమోసాలు తింటూ ఉంటారు. అలాంటి ఈ సమోసాను మన ఇండియన్ వంటకం అని చాలామంది భావిస్తారు కానీ ఇది ఇండియా వంటకం కాదట. ఇది ఇరానీ వంటకం అని ఇరాన్ లో దీన్ని "సాంబోసా" అని పిలుస్తారట.
మొగలుల ద్వారా ఈ ఆహారం మన ఇండియాకు వచ్చింది అని నిపుణులు చెబుతూ ఉంటారు. సాధారణంగా మన ఇండియాలో ఈ సమోసా తయారు చేయడానికి బంగాళాదుంప, పల్లీలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ గతంలో ఈ సమోసాలో మాంసం కీమాతో నింపి అద్భుతంగా తయారు చేసేవారు. ఇక కాలక్రమేనా ఇది వెజ్ ఐటమ్ గా మారిపోయి బంగాళదుంప, పల్లి ఇతర పదార్థాలతో తయారు చేస్తున్నారు.
ఈ ఆహారం ఇంత ప్రాచుర్యం పొందింది కాబట్టే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ సమోసా దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అలాంటి సమోసాలు ఇండియా మొత్తంలో సమోసా అనే పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో చాలా మందికి తెలియదు. అయితే సమోసాను ఇంగ్లీషులో "రిస్సోల్" అని పిలుస్తారట. మరి సమోసా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి.