ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలనటుడుగా చేసి ఎంతో గుర్తింపు పొందినటువంటి నటీనటులు ప్రస్తుతం చదువులు పూర్తిచేసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోలుగా, హీరోయిన్స్ గా అడుగు పెడుతున్నారు. చిన్నప్పుడు వారిని చూసిన మనం ఇప్పుడు చూసేసరికి చాలా ఆశ్చర్య పోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో ఈ బాలనటుడు చాలా స్పెషల్. డైలాగ్ డెలివరీ వల్ల చిన్నతనంలోనే బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే ఆహా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినటువంటి మహేంద్రన్.
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలనటుడుగా చేసి ఎంతో గుర్తింపు పొందినటువంటి నటీనటులు ప్రస్తుతం చదువులు పూర్తిచేసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోలుగా, హీరోయిన్స్ గా అడుగు పెడుతున్నారు. చిన్నప్పుడు వారిని చూసిన మనం ఇప్పుడు చూసేసరికి చాలా ఆశ్చర్య పోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో ఈ బాలనటుడు చాలా స్పెషల్. డైలాగ్ డెలివరీ వల్ల చిన్నతనంలోనే బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే ఆహా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినటువంటి మహేంద్రన్.
1994లో కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. పెదరాయుడు సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో 'నేను చూసాను తాతయ్య' అంటూ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోల కాంబినేషన్ లో నటించి అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరి మన్ననలు పొందాడు. తర్వాత పెళ్లి చేసుకుందాం, దేవి, ఆహా, లిటిల్ హాట్స్, నీ స్నేహంతో పాటుగా దాదాపు 130 చిత్రాల్లో బాల నటుడిగా నటించారు మహేంద్రన్.
అయితే కొన్నాళ్లపాటు స్టడీస్ పై దృష్టి పెట్టి, ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసిన ఆయన హీరోగా ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే మాస్టర్ సినిమాలో యంగ్ భవాని రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా గత ఏడాది 'రిప్ అఫ్ బరీ' అనే మూవీలో నటించారు.
అంతేకాకుండా ఓటీటీ వెబ్ సిరీస్ లో కూడా నటించి తన నటన టాలెంట్ నిరూపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలేదు కానీ, తమిళంలో ఇప్పటికే తన మానియా చూపిస్తున్నాడు. మంచి క్యారెక్టర్ దొరికితే తెలుగులో కూడా నటించడానికి తహతలాడుతున్నాడట.