బ్రహ్మ పురాణం ప్రకారం నాగ పంచమి రోజున పాములను పూజించడానికి బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అయితే నాగపంచమి రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదట
న్యూస్ లైన్ డెస్క్ : హిందువుల పండుగల్లో నాగపంచమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజున అందరూ పామును దేవతగా భావించి పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు మొక్కుకుంటారు. ఈ ఏడాది ఆగష్టు 9న నాగపంచమి వచ్చింది. ఈరోజున పుట్టలో పాలు పోసి పూజిస్తే కాలసర్ప దోషం పోతుందని ఒక నమ్మకం.
బ్రహ్మ పురాణం ప్రకారం నాగ పంచమి రోజున పాములను పూజించడానికి బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అయితే నాగపంచమి రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. అవేంటో ఓ లుక్కేద్దామా..
నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టిని తవ్వకూడదట. భూమి దున్నడం, ఆకుకూరలు, పండ్లు తెంపడం, భూమికి రంద్రాలు చేయడం వంటివి అస్సలు చేయకూడదట. ఎట్టి పరిస్థితుల్లో పామును అస్సలు కొట్టకూడదు.
నాగపంచమి రోజున పామును కొట్టినా, కీడు తలపెట్టినా సంతానం కలుగదట. పాములు ఉన్న పుట్టలో పాలు పోయడం లాంటివి కాకుండా విగ్రహాలకు మాత్రమే అభిషేకం చేయాలని పండితులు చెప్తున్నారు.
నాగపంచమి రోజు కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునై వస్తువులు ఉపయోగించకూడదు. పూజ తర్వాత మంటలు, హారతి, దీపం వంటివి పుట్టకు దూరంగా ఇవ్వాలి.