Drumstick:ఈ వ్యక్తులు ములక్కాయలు తింటే ప్రమాదమేనా.?

ములక్కాయ ప్రస్తుతం మార్కెట్లో దొరికే అద్భుతమైనటువంటి ఆహార పదార్థం. ఈ ములక్కాడ  ఆకుల నుంచి మొదలు కాయల వరకు అన్ని ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగిస్తాయి. ములక్కాడను సాంబార్


Published Aug 15, 2024 08:55:00 PM
postImages/2024-08-15/1723729605_drumsstick.jpg

న్యూస్ లైన్ డెస్క్: ములక్కాయ ప్రస్తుతం మార్కెట్లో దొరికే అద్భుతమైనటువంటి ఆహార పదార్థం. ఈ ములక్కాడ  ఆకుల నుంచి మొదలు కాయల వరకు అన్ని ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగిస్తాయి. ములక్కాడను సాంబార్ పెట్టుకొని తింటే ఆ రుచి వేరు. అలాంటి ములక్కాడ వల్ల  ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట. మరి ములక్కాడ ఎవరెవరు తినకూడదు. వివరాలు చూద్దాం ..

 గుండె జబ్బులు :
 ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువగా ఉన్న వ్యక్తులు ములక్కాయను అస్సలు తినకూడదట. ఇందులో ఉండే ఆల్కలాయిడ్ గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తుందట. చాలావరకు ములక్కాడను ఈ వ్యాధులు ఉన్నవారు తినకపోవడమే మంచిది. 

 బిపి: ఎక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు ములక్కాడలను తినవచ్చు. కానీ తక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు వీటిని అస్సలు తినకూడదు.  ఎందుకంటే దీనివల్ల బిపి పెరుగుతుందట.

 కడుపు నొప్పి:
 ముఖ్యంగా గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు ములక్కాడలను ఎక్కువగా తినకూడదట. దీనివల్ల గ్యాస్ డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

 ఎలర్జీ:
 ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ తో బాధపడే వ్యక్తులు  ఈ ములక్కాడలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరం అంతట వాపు చికాకు వంటి సమస్యలను తీసుకువస్తుందట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health heart-problems elargy

Related Articles