DSC candidate: డీఎస్సీ అభ్యర్థి ఆమరణ దీక్ష.!

తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గత కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అయితే, సోమవారం రాత్రి నుండి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుండే స్టేట్, సెంట్రల్ పొలిసు బలగాలు యూనివర్సిటీని ముట్టడించాయి. ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. 
 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720515064_Screenshot20240709141841.jpg

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీని మూడు నెలల  పాటు వాయిదా వేయాలని నిద్యోగులు ఆందోళనలు చేపడుతున్న వేళ ఓ అభ్యర్థి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గత కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అయితే, సోమవారం రాత్రి నుండి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుండే స్టేట్, సెంట్రల్ పొలిసు బలగాలు యూనివర్సిటీని ముట్టడించాయి. ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. 

దీంతో హాస్టల్ గదిలోనే ఓ యువకుడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మమ్మల్ని వాడుకుని వదిలేసిందని డీఎస్సీ అభ్యర్ధి గోపీ ఆవేదన వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరుద్యోగులంతా ఏకమై ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకోకపోడం లేదని మండిపడ్డారు. మిగితా అభ్యర్ధులంతా ఇదే విధంగా ఉద్యమించి డీఎస్సీ వాయిదా పడే వరకు పోరాడాలని పిలుపునిచ్చాడు. 

కాగా, డీఎస్సీని రద్దు చేసి మరో 30 వేల  పోస్టులను పెంచి మళ్లీ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలను పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘం నాయకుడు మోతిలాల్ 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడని విషయం తెలిసిందే. ఇక డీఎస్సీ అభ్యర్ధి గోపీ దీక్షతోనైనా సర్కార్ కదిలి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam police congress-government unemployed osmaniauniversity

Related Articles