పంతంగి టోల్ ప్లాజా వద్ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా బంగారాన్ని సీజ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: పంతంగి టోల్ ప్లాజా వద్ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.5 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి బీదర్‌కు మారుతి సుజుకి కారులో హ్యాండ్ బ్రేక్ కింద సపరేట్ స్థావరంను ఏర్పాటు చేసుకొని నిందితులు బంగారాన్ని తరలిస్తున్నారు. ఈ తరలింపులో జగ్గయ్యపేట స్థానిక బంగారం తరలించే ముట్ట చేతి హస్తం ఉందని పలు అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద కారును తనిఖీ చేసి నిందితులను అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రెండు కోట్ల 50 లక్షల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడున్నర కిలోల బంగారం, మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఎవ్వరి హస్తం ఉందో పూర్తి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.