చిన్నచిన్న ఉద్యోగులు పేదలు సాయిప్రియ ఎన్‌క్లేవ్ ఉన్న భూములు కొనుకున్నారు. నిరుపేదలు కొనుక్కొని నిర్మించుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని అన్నారు. అక్రమ భూములు అయితే.. ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహరుణాలకు ఎలా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 300 మంది రోడ్డున పడ్డారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పాలనపై లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నచిన్న ఉద్యోగులు పేదలు సాయిప్రియ ఎన్‌క్లేవ్ ఉన్న భూములు కొనుకున్నారు. నిరుపేదలు కొనుక్కొని నిర్మించుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని అన్నారు. అక్రమ భూములు అయితే.. ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహరుణాలకు ఎలా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 300 మంది చిరు ఉద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూముల విషయంలో ఇప్పుడు కలగజేసుకోవడం సరికాదని అన్నారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ఈటల ప్రశ్నించారు.