తన భూమిని కొలిచి సరైన వివరాలు తెలిపాలని సర్వేయర్‌ను కిష్టయ్య కోరాడు. కానీ, సర్వేయర్‌పై ఆగంరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని కృష్ణయ్య వాపోయాడు. దీంతో సర్వేయర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. ఈ విషయంలో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపం చెందిన కృష్ణయ్య పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాలపడ్డాడు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ నేత వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల పరిధిలోని దమ్మక్కపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు బండి పెద్దోళ్ల కృష్ణయ్య భూమిపై ఆగంరెడ్డి అనే వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఆగంరెడ్డి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు.
అయితే, తన భూమిని కొలిచి సరైన వివరాలు తెలిపాలని సర్వేయర్‌ను కృష్ణయ్య కోరాడు. కానీ, సర్వేయర్‌పై ఆగంరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని కృష్ణయ్య వాపోయాడు. దీంతో సర్వేయర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. ఈ విషయంలో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర మస్తాపం చెందిన కృష్ణయ్య పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాలపడ్డాడు. గమించిన స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, భూమిని తిరిగి ఇవ్వాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని ఆగంరెడ్డి డిమాండ్ చేస్తున్నాడని వాపోతున్నాడు. లేదంటే ఊర్లోనే ఉండనివ్వనని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపాడు. కాగా, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి అనుచరుడిగా ఆగంరెడ్డికి పేరుందని స్థానికులు తెలిపారు.