ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుద్యోగులు TGSPSCకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో వారిని వెనక్కి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: TGSPSC ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు, BRSV కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. దీంతో TGSPSC వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పటు చేశారు. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్ మెట్రో లోకి వెళ్లేందుకు నిరుద్యోగులకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. స్టేషన్ వద్దకు వచ్చిన అందరి ఫోన్ లను తీసుకొని వాట్సాప్ చెక్ చేసి పంపిస్తున్నారు.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుద్యోగులు TGSPSCకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో వారిని వెనక్కి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల తోపులాటలో ఓయూ విద్యార్థికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తోపులాటలో ఓయూ విద్యార్థి తలకు గాయం. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలింపు. pic.twitter.com/k1ddOAqYGi — News Line Telugu (@NewsLineTelugu) July 5, 2024