Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ ఈ డైట్ వల్లే బరువుపెరిగిందట

ఒలంపిక్స్ పోటీల్లో అదనపు బరువుకు వినేశ్ ఫొగాట్ పతకం కోల్పోయింది. సెమీస్ కు ముందు వరకు 49.9 ఉన్న బరువున్న వినేశ్ తెల్లారే సరికి 3 కేజీల బరువు పెరిగింది.


Published Aug 15, 2024 12:54:00 PM
postImages/2024-08-15/1723706975_vineshpoghat.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఒలంపిక్స్ పోటీల్లో అదనపు బరువుకు వినేశ్ ఫొగాట్ పతకం కోల్పోయింది. సెమీస్ కు ముందు వరకు 49.9 ఉన్న బరువున్న వినేశ్ తెల్లారే సరికి 3 కేజీల బరువు పెరిగింది. ఆమె వెయిట్ 52.7 కిలోలకు చేరింది, అయితే వెయిట్ తగ్గడానికి ఆరుగంటల పాటు తీవ్రంగా శ్రమించి వ్యాయామం చేసినా తగ్గలేదు. నిబంధనల కన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ప్రత్యర్థిపై గెలిచినప్పటికీ ఫొగాట్ కు పతకం దక్కకుండా పోయింది. తన బరువు పెరగడానికి కారణం తన డైట్.


ఒక గ్లాస్ పళ్ల రసం, ఫ్లూయిడ్స్‌, లైట్‌గా స్నాక్స్‌.. సెమీస్ కు ముందు వినేశ్ ఫొగాట్ తీసుకున్న డైట్ ఇది. 300 గ్రాములు సమానమైన జ్యూస్‌ను తాగడంతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకుంది. లిక్విడ్స్ రూపంలో జ్యూస్ లు, లైట్ స్నాక్స్ విత్ హెవీ క్యాలరీలు..మాగ్జిమం వీటివల్లే బరువు పెరిగిందట. 3 గంటల పాటు సౌనా బాత్, చుక్క నీరు కూడా తీసుకోలేదు. అయినా అవసరమైన మేర బరువు తగ్గకపోవడంతో ఫొగాట్ దుస్తులకు ఉన్న ఎలాస్టిక్‌ ను, జుట్టును కోచ్ లు తీసేశారు. ఆ తర్వాత కూడా 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో వినేశ్ ఫొగాట్ పై వేటు పడింది.
ఆరు గంటల పాటు వ్యాయామాలు , రాత్రంతా చేసినా వ్యాయామం , తన జుట్టు కత్తిరించుకోవడం లాంటివన్నీ ...తన కష్టం అంతా వృధా గా పోయింది. తన మెడల్ కోసం కాసా లో అప్పీల్ చేసింది. అది కూడా తోసిపుచ్చారు. వినేశ్ ఫొగాట్ కష్టం వృధా గా పోయింది. తన డైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu olympic2024- vinesh-phogat indian-weightlifter

Related Articles