goa: ఆల్కహాల్ కోసం గోవా వెళ్తున్నారా ...గోవాలో మందు బంద్ !

అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో గోవా ఒకటి. మందు తాగుతూ సముద్ర అందాలను వీక్షించేందుకు ఎంతో మంది మంది గోవాలో పర్యటిస్తుంటారు.  గోవాలో మద్యం నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది.


Published Jul 31, 2024 06:19:12 AM
postImages/2024-07-31/1722424721_goa.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  బ్రేకప్ అయ్యింది రా...గోవా పోదాం బావా....మనసు బాలేదు గోవా వెళ్దాం...బ్యాచలర్ పార్టీ ..గోవా వెళ్దాం....కుర్రాళ్లకు గోవా ఓ ఎమోషన్.  ఇదంతా విని గోవా మీద ప్రేమనుకుంటే...మనంత వెర్రి వాళ్లు మరొకరు ఉండరు. ఆ ప్రేమంతా గోవా లో మందు మీద..ఆల్కహాల్ చీప్ అని చిన్నపిల్లాడికి కూడా తెలుసుగా.. అలా చవక చవక అని తెగ తాగేస్తున్న కుర్రాళ్లకు ..ఓ బ్యాడ్ న్యూస్ . త్వరలో గోవాలో మద్యపాన నిషేధం జరగనుంది.


అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో గోవా ఒకటి. మందు తాగుతూ సముద్ర అందాలను వీక్షించేందుకు ఎంతో మంది మంది గోవాలో పర్యటిస్తుంటారు.  గోవాలో మద్యం నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ డిమాండ్ ను అసెంబ్లీలోకి ప్రస్తావించారు. గోవా లో మందు బ్యాన్ చేస్తే ఇక  ఆ రాష్ట్రానికి ఎవ్వరు వెళ్లరని అంటున్నారు కుర్రాళ్లు.


గోవాలో మద్యం వల్ల పెద్ద సంఖ్యలో రోడ్డు, కంపెనీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గోవా ఇప్పటికే  అభివృధ్ధి చెందింది . మరింత అభివృధ్ధి చెందిన రాష్ట్రం నిర్మించాలంటే మధ్యపాన నిషేదం ఒక్కటే మార్గం. పూర్తిగా బ్యాన్ చేయకపోయినా ...మద్యపాన వినియోగాన్ని తగ్గించినా చాలని అన్నారు.మద్యాన్ని నిషేధించిన రాష్ట్రాల జాబితాలో గోవాను చేర్చాలని ఆయన కోరారు. మద్యపాన వినియోగాన్ని సగం అయినా తగ్గిస్తే బాగుంటుందని అన్నారు. గోవాలో విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలకు దగ్గర్లో 269 మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో ఈ ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. ఇదే కారణంతో ఆల్కహాల నిషేధానికి పావులు కలుపుతున్నారు.  ఇది కాని వర్కవుట్ అయితే మాత్రం మందుబాబులకు గట్టి దెబ్బ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu alchohal

Related Articles