KTR: పేదల పట్ల సర్కార్ దుర్మార్గపు చర్యలు

ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే.. 'కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్టుంది!' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని మండిపడ్డారు.


Published Jul 13, 2024 01:50:35 PM
postImages/2024-07-13/1720852020_modi85.jpg

న్యూస్ లైన్ డెస్క్: పెన్షన్ కింద వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఓ 80 ఏళ్ల వృద్ధురాలికి అధికారులు నోటీసులు పంపించారు. ఏదో సాంకేతిక లోపం ఉందంటూ.. గత BRS ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్షా 72 వేలను తిరిగి చెల్లించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి నోటీసులు వెళ్లాయి. అయితే, ఆ వృద్ధురాలు ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ.. కేవలం పెన్షన్ డబ్బులతోనే జీవిస్తోందని గ్రామస్థులు తెలిపారు.

తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే.. 'కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్టుంది!' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని మండిపడ్డారు.

ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని తెలిపారు. వెంటనే పేదల పట్ల ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ప్రభుత్వంపై తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress ktr telanganam congress-government pension asarapension

Related Articles