Congress: దిగొచ్చిన సర్కార్.. గ్రూప్-2 వాయిదా..!

వారం కిందే నిర్ణయం..!
ముందే చెప్పిన 'న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం'
నాన్చుడు ధోరణితో అభ్యర్థుల్లో ఆందోళన
వాయిదా కోరుతూ రోడ్లపైకి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు
అర్ధరాత్రి అశోక్ నగర్ చౌరాస్తాలో హోరెత్తిన నినాదాలు
సెక్రటేరియట్‌లో నిరుద్యోగులతో రహస్య మంతనాలు
గురువారం ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి చర్చలు
శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి మాటా మంతీ
డీఎస్సీ ప్రారంభమైన తర్వాతే వ్యూహాత్మక ప్రకటన


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721453348_studnetsprotest116866497613x2.webp

న్యూస్ లైన్ డెస్క్: గ్రూప్ 2 వాయిదా పడుతుందని ముందుగానే చెప్పింది న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం. సెక్రటేరియట్‌లో కొంతమంది అభ్యర్థులతో మంతనాలు జరిపారని, చాలా ప్లాన్డ్‌గా వాయిదా ప్రకటన రాబోతుందని క్లియర్ కట్‌గా వివరించాం. మేం చెప్పినట్టుగానే గ్రూప్ 2 పరీక్షలను రేవంత్ సర్కార్ వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాక, వారంతా పరీక్షల హడావుడిల ఉండగా, గ్రూప్ 2పై సంచలన ప్రకటన చేసింది. ఆందోళనల్లో పాల్గొన్నవారిపై ఆది నుంచి ప్రభుత్వం సీరియస్‌గానే వ్యవహరించింది. సాక్షత్తు ముఖ్యమంత్రి పరీక్షలు రాయలేనోళ్లు, సదువుకోనోళ్లు, తలకుమాసినోళ్లు అంటూ నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో నిరసన కార్యక్రమాలు సాగించారు. చివరకు అనుకున్నది సాధించారు. 

గ్రూప్ 2 ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్టు సర్కార్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన అభ్యర్థులు వాయిదా వేయాలని మరోసారి కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం ఓకే చెప్పడంతో వాయిదా ప్రకటన విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా, డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేసింది. గత కొన్నిరోజులుగా డీఎస్సీ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తం 783 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటనను టీజీపీఎస్సీ జారీ చేసింది. 2024 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగస్ట్ 9, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ మరోసారి ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్- 2 పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులతో అభ్యర్థులు చర్చించారు. ఆ చర్చలు అనంతరం గ్రూప్ 2ను వాయిదా వేస్తూ శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

దీనికి ముందు పెద్ద కథే నడిచింది. నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలు జరిపారు. సెక్రటేరియట్‌లో భేటి అయినట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత ఆదివారం అర్ధరాత్రి ఈ రహస్య భేటీ అయినట్టు సమాచారం. ఈ భేటీలో డీఎస్సీ అభ్యర్థులకు వాయిదా ప్రకటన తెలిపినట్టు తెలిసింది. డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాక గ్రూప్స్‌పై ప్రకటన చేస్తామని, ఆ మేరకు ఆందోళనలను విరమించాలని కోరినట్టుగా సమాచారం. ఆ మాట ప్రకారమే డీఎస్సీ పరీక్షలు మొదలైన ఒక రోజుకు వాయిదా ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఓ అభ్యర్థితో ఫోన్‌లో మాట్లాడుతూ వాయిదాపై హింట్ ఇచ్చి మరీ చెబుతారు. ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చి, దాన్ని అమలు చేసేందుకు నానా ప్రయత్నాలు చేసింది సర్కార్.

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu congress telanganam congress-government groups

Related Articles