గత నెల 29న వాంతులు కావడంతో పాఠశాల సిబ్బంది చిన్నారికి టాబ్లెట్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే, వాంతులు మరింత పెరగడంతో తమకు సమాచారం ఇచ్చారని విద్యార్థి తల్లిదండ్రుల వెల్లడించారు. వెంటనే వెళ్లి అంజలిని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లామని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో గురుకులాలను చెందిన విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నారు. గడించిన 9 నెలల్లోనే 38 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువకముందే గురుకులలో చదువుతున్న మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న అంజలి(12) మృతిచెందింది. గత నెల 29న వాంతులు కావడంతో పాఠశాల సిబ్బంది చిన్నారికి టాబ్లెట్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే, వాంతులు మరింత పెరగడంతో తమకు సమాచారం ఇచ్చారని విద్యార్థిని తల్లి వెల్లడించారు. వెంటనే వెళ్లి అంజలిని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లామని తెలిపారు.
కాగా, అప్పటికే జ్వరం ఎక్కువ అయిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ తీసుకొని వెళ్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయిందని అంజలి తల్లి తెలిపారు. తన కూతురు రెండు రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నా గురుకుల సిబ్బంది పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాళ్లు ముందే సమాచారం ఇచ్చి ఉంటే తన కూతురు బ్రతికేదని అంజలి తల్లి బోరున విలపించింది. మృతిచెందిన చిన్నారిని జుక్కల్ మండలం పడంపల్లి గ్రామ వాసిగా గుర్తించారు.