BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు తమ నెల జీతాన్ని వరద బాధితులకు ఆర్ధిక సహాయంగా అందిస్తన్నామని ఆయన తెలిపారు. BRS లాగానే బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఖమ్మం మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ఆపద సమయంలో సిద్దిపేట నుండి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు.
వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన విమర్శించారు. ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని అన్నారు. BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు తమ నెల జీతాన్ని వరద బాధితులకు ఆర్ధిక సహాయంగా అందిస్తన్నామని ఆయన తెలిపారు. BRS లాగానే బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన తమపై దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు. అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఆయన అన్నారు. BRSకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్చుకోలేకనే ఇటువంటి దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేక పోయారని అన్నారు. వరద బాధితులకు రూ. 2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.