సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నీళ్లు లేక అడుగంటిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాం రంగనాయక సాగర్‌లో గోదావరి జలాల ఎత్తిపోతలను మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌కు గోదావరి జల పరవళ్లు చూస్తుంటే ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రైతులకు నీరు అందించాలని నిత్య తపనకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.
అన్నదాతల ఆనందం, వారి ముఖాల్లో చిరునవ్వు చూడడమే తన లక్ష్యమని వెల్లడించారు. జలదృశ్యాన్ని చూస్తే మనసు పులకరించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నీళ్లు లేక అడుగంటిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హరీష్ రావు లేఖతో కదలిన ప్రభుత్వ యంత్రాంగం సోమవారం మిడ్ మానేరు నుంచి నీటి తరలింపు ప్రక్రియను ప్రారంభించింది.