Harish rao: బోనమెత్తిన హరీష్ రావు

ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి నెలకొందని అన్నారు. మహంకాళి అమ్మ దయతో మంచి వర్షాలు పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


Published Jul 14, 2024 05:47:42 AM
postImages/2024-07-14/1720953906_modi20240714T161145.718.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆషాడం బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి బోనం ఎత్తుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్దించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి నెలకొందని అన్నారు. మహంకాళి అమ్మ దయతో మంచి వర్షాలు పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. సాగునీటికి , తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,  మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu brs harishrao bonalu bonalufestival gajwel siddipet mahankalitemple

Related Articles