SGTల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేఖ ద్వారా హరీష్ రావు కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు పాఠశాలలకు ఫ్రీ కరెంట్ బిల్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పుతోందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలోని అవకతవకలపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏడు నెలల జీతాలు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను కూడా చెల్లించాలని సూచించారు.
మరోవైపు SGTల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేఖ ద్వారా హరీష్ రావు కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు పాఠశాలలకు ఫ్రీ కరెంట్ బిల్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించాలని హరీష్ రావు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు విద్యార్థుల ఆకలి తీర్చే 'సీఎం బ్రేక్ ఫాస్ట్' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని సూచించారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులకు కూడా గత 4 నెలలుగా జీతాలు రావడం లేదని, వెంటనే పెండింగ్ జీతాలను చెల్లించాలని హరీష్ రావు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.