ఎన్నికల అధికారిని పోలింగ్ కేంద్ర వీధుల్లో అందరిముందు చెంప చెల్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజస్థాన్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో షాకింగ్ సంఘటన జరిగింది. రాజస్థాన్ డియోలీ. యునియారా అసెంబ్లా స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధి నరేష్ మీనా ఎన్నికల అధికారిని పోలింగ్ కేంద్ర వీధుల్లో అందరిముందు చెంప చెల్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
నరేష్ మీనా బుధవారం డియోలీ సబ్‌డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్‌లో మల్పురా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అమిత్ చౌదరిని కొట్టాడు. సంరవత పోలింగ్ కేంద్రంలో డ్యూటీ లో ఉన్న వ్యక్తిని కొట్టడంపై చాలా సీరియస్ ఎలిగేషన్ అయ్యింది. అనంతరం పోలీసులు నరేష్ మీనాను బలవంతంగా అదుపుచేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన మద్ధతుదారులు అక్కడికక్కడే బైఠాయించి దర్నాకు దిగారు. అనంతరం వాహనాలకు నిప్పు పెట్టి ..పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. వెంటనే ఇక్కడ నుంచి నరేష్ మీనా అక్కడ నుంచి తప్పించుకున్నారు.
ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ముగ్గురు నకిలీ ఓటర్లను ఓటేసేందుకు SDM అనుమతించాడని నరేష్ మీనా ఆరోపించాడు. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయిస్తున్నారని కూడా ఆరోపించాడు. ఇక్కడ వాదోపవాదాలు పెరిగి ఆయనను కొట్టాల్సి వచ్చిందని నరేష్ మీనా ను సపోర్ట్ చేసే వారు అంటున్నారు. అయితే పబ్లిక్ ఆస్తులు ధ్వంసం కావడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడంపై పెద్ద రచ్చ లేసింది.నేపథ్యంలో షీల్డ్‌లు, రక్షణ దుస్తులు, హెల్మెట్‌లు ధరించిన పోలీసులు చివరకు హైడ్రామా మధ్య ఈ రోజు నరేష్ మీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajasthan Congress rebel Naresh Meena 'slaps' local SDM during bypolls
Read More:https://t.co/GNfRZxMMQq pic.twitter.com/jQKsvrFERu — The Indian Express (@IndianExpress) November 13, 2024