Harish rao: రేవంత్‌రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదని. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా గ్రూప్-1  మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని వెల్లడించారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 1:15గా పేర్కొన్నప్పటికీ, తరువాత అభ్యర్థుల కోరిక మేరకు 1:100  నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని తెలిపారు. గ్రూప్-1 పరీక్ష యపీపీఎస్ఈ లాగా ప్రతి ఏడాది ఉండదని.. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల అభ్యర్థుల సంఖ్య పెరిగిందని హరీష్ రావు వివరించారు. 

Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-14/1720959862_modi79.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారని తెలిపారు. మరోవైపు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని ఆయన కోరారు.

1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదని. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా గ్రూప్-1  మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని వెల్లడించారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 1:15గా పేర్కొన్నప్పటికీ, తరువాత అభ్యర్థుల కోరిక మేరకు 1:100  నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని తెలిపారు. గ్రూప్-1 పరీక్ష యపీపీఎస్ఈ లాగా ప్రతి ఏడాది ఉండదని.. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల అభ్యర్థుల సంఖ్య పెరిగిందని హరీష్ రావు వివరించారు. 

గతంలో మీరు చేసిన డిమాండ్‌ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు ? గతంలో మీరు ప్రకటించిన  వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. గ్రూప్-2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్-3కి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని హరీష్ రావు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.  

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu congress telanganam harishrao dsc groups unemployed

Related Articles