వార్షిక బడ్జెట్‌లో ఏటా వంద కోట్లు కేటాయించాలని.. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. వారికి స్కాలర్షిప్స్ అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని హరీష్ రావు లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. BRS అధికారంలో ఉన్న సమయంలో లాగానే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్షిక బడ్జెట్‌లో ఏటా వంద కోట్లు కేటాయించాలని.. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. వారికి స్కాలర్షిప్స్ అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని హరీష్ రావు లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
బెస్ట్ స్కీం కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేద పాఠశాలల్లోని వేద పండితులకు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.5 వేల గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలి. 75 ఏళ్లు పై బడిన వేద పండితులకు ఇచ్చే రూ. 5 వేల భృతి ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వారికి ఆర్థిక చేయూత ఎంతో అవసరం కాబట్టి వెంటనే చెల్లించాలని కోరారు. సూర్యాపేట, ఖమ్మం, మధిరలో నిర్మించతలపెట్టిన బ్రాహ్మణ సదనాల పనులు ఆగిపోయాయని హరీష్ రావు తెలిపారు. ఆ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు