భట్టి స్లీపింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు BRS పదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందంటూనే.. మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్నారని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై హరీష్ రావు అసెంబ్లీలో చర్చించారు. బడ్జెట్ ప్రసంగం అంతా BRSను తిట్టిపోయడానికే రాసినట్లు ఉందని ఆయన విమర్శించారు. ఒక రాజకీయ కరపత్రం లాగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. BRSపై విమర్శలు చేయడంపైనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో దశ-దిశ లేదని పాలన నడుస్తోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క పాలసీని కూడా సక్రమంగా నిర్వహించలేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విజన్ లేదు.. విషయం.. ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. భట్టి స్లీపింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు BRS పదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందంటూనే.. మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్నారని అన్నారు. పదేళ్ల పాటు BRS పాలన కొనసాగిస్తే.. గత 8 నెలలుగా కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని అన్నారు.
BRS అధికారంలో ఉన్న సమయంలో రూ.4.5లక్షలు కూడా లేని GSPDని రూ.14 లక్షల వరకు తీసుకొని వెళ్లామని గుర్తుచేశారు. రామగుండం నుండి 1400 మెగావాట్ల కరెంటు వచ్చిందని అన్నారు. BRS పాలన సరిగాలేదని మాటల్లో చెబితే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. అందుకు ఆధారాలు కూడా చూపించాలని డిమాండ్ చేశారు. BRS పాలనలో రూ.200 పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచామని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ చెప్పిన రూ.4 వేల పింఛన్ నాలుక మీదనే ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే No.1గా తెలంగాణ నిలిచిందని హరీష్ రావు గుర్తుచేశారు. ఇది BRS పాలన ఫలితమా.. లేదా కాంగ్రెస్ 8 నెలల డ్రామా ఫలితమా..? అని ప్రశ్నించారు. నేను, భట్టి విక్రమార్క ఇద్దరం అసెంబ్లీ ముందు రోడ్డు మీదికి వెళ్తామని, BRS పాలనలో కరెంటు కోతలు ఉన్నాయా.. లేదా కాంగ్రెస్ పాలనలో ఉన్నాయా అనేది ప్రజలనే అడుగుతామని అన్నారు.